చాంపియన్‌ శ్రీవల్లి రష్మిక | Srivalli Rashmika Wins Junior Tennis Title | Sakshi
Sakshi News home page

చాంపియన్‌ శ్రీవల్లి రష్మిక

Aug 18 2019 10:10 AM | Updated on Aug 18 2019 10:10 AM

Srivalli Rashmika Wins Junior Tennis Title - Sakshi

చెన్నై: తెలంగాణ అమ్మాయి శ్రీవల్లి రష్మిక జాతీయ జూనియర్‌ క్లే కోర్ట్‌ టెన్నిస్‌ చాంపియన్‌గా నిలిచింది. చెన్నైలో శనివారం ఈ టోర్నీ ముగిసింది. ఫైనల్లో శ్రీవల్లి 7–6(7/3), 2–6, 6–1తో రేష్మా మరూరి (కర్ణాటక)పై విజయం సాధించింది. టైటిల్‌ కోసం ఇరువురు క్రీడాకారిణులు తీవ్రంగా శ్రమించారు.

పోటాపోటీగా సాగిన మొదటిసెట్‌ను శ్రీవల్లి టై బ్రేక్‌లో సొంతం చేసుకుంది. అయితే రెండో సెట్‌లో పుంజుకున్న రేష్మా మరూరి 6–2తో సెట్‌ను కైవసం చేసుకుంది. విజేతను తేల్చే మూడో సెట్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీవల్లి సెట్‌ను 6–1తో గెలిచి మ్యాచ్‌ను, టైటిల్‌ను సొంతం చేసుకుంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement