శ్రీలంక తడబాటు

శ్రీలంక తడబాటు - Sakshi


మిర్పూర్: ఆసియాకప్లో భారత్ జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్లో శ్రీలంక తడబడుతూ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. శ్రీలంక 57 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆరు పరుగుల వద్ద తొలి వికెట్ను నష్టపోయిన లంకేయులు.. 15 పరుగుల వద్ద మరో వికెట్ ను కోల్పోయారు. శ్రీలంక ఓపెనర్ చండిమల్(4)ను మొదటి వికెట్గా పెవిలియన్ చేరగా, ఫస్ట్ డౌన్ వచ్చిన జయసూరియా(3) రెండో వికెట్ గా అవుటయ్యాడు. కాగా, మరో ఓపెనర్ దిల్షాన్(18)ను మూడో వికెట్ గా పెవిలియన్ , మాథ్యూస్ (18) నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. దీంతో 11.0 ఓవర్లలో శ్రీలంక నాలుగు కీలక వికెట్లను నష్టపోయింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు సాధించగా, ఆశిష్ నెహ్రా, బూమ్రాలకు తలో వికెట్ లభించింది.


 


ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత శ్రీలంకను బ్యాటింగ్ ఆహ్వానించింది. భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. గత మ్యాచ్లో ఆడిన అజింక్యా రహానేకు విశ్రాంతినివ్వడంతో శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇప్పటికే రెండు వరుస మ్యాచ్ల్లో గెలిచి ఊపు మీద ఉన్న ధోని సేన ఈ మ్యాచ్లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని భావిస్తోంది. ఒకవేళ టీమిండియా గెలిస్తే ఫైనల్ కు చేరిన  తొలి జట్టుగా నిలుస్తుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top