పోరాడి ఓడిన శ్రీకాంత్‌ | Srikanth fought loss | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన శ్రీకాంత్‌

Mar 4 2017 1:21 AM | Updated on Sep 5 2017 5:06 AM

పోరాడి ఓడిన శ్రీకాంత్‌

పోరాడి ఓడిన శ్రీకాంత్‌

గాయం నుంచి కోలుకున్నాక ఆడుతున్న రెండో అంతర్జాతీయ టోర్నమెంట్‌ జర్మన్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి

ముల్హీమ్‌ యాన్‌ డెర్‌ రుర్‌ (జర్మనీ): గాయం నుంచి కోలుకున్నాక ఆడుతున్న రెండో అంతర్జాతీయ టోర్నమెంట్‌ జర్మన్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ పోరాటం ముగిసింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 12వ సీడ్‌ శ్రీకాంత్‌ 19–21, 20–22తో రెండో సీడ్‌ చెన్‌ లాంగ్‌ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు.

రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌తో 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ రెండు గేముల్లోనూ ఆధిక్యంలోకి ఉండి కూడా వెనుకబడిపోవడం గమనార్హం. తొలి గేమ్‌లో 12–6తో, రెండో గేమ్‌లో 12–9తో, 16–12తో శ్రీకాంత్‌ ముందంజ వేసినా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement