లంకలో పర్యటించండి | Sri Lanka Cricket Board (SLC) Urges BCCI To Visit Sri Lanka For Matches | Sakshi
Sakshi News home page

లంకలో పర్యటించండి

May 16 2020 3:02 AM | Updated on May 16 2020 3:02 AM

Sri Lanka Cricket Board (SLC) Urges BCCI To Visit Sri Lanka For Matches - Sakshi

కొలంబో: షెడ్యూల్‌ ప్రకారం ద్వైపాక్షిక సిరీస్‌ కోసం తమ దేశంలో పర్యటించాల్సిందిగా బీసీసీఐని శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) కోరింది. కరోనా నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన క్రికెట్‌ సిరీస్‌లు, టోర్నీల నిర్వహణపై అనిశ్చితి నెలకొనడంతో లంకకు వచ్చే అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా బీసీసీఐకి ఈ–మెయిల్‌ ద్వారా తెలిపింది. జూన్‌–జూలై మధ్య శ్రీలంక పర్యటనలో భారత్‌ 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడాల్సి ఉంది. కఠిన క్వారంటైన్‌ నిబంధనలు పాటించడంతో పాటు ప్రేక్షకులు లేకుండానే టోర్నీని నిర్వహిస్తామని లంక అధికారులు పేర్కొనట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ పరిస్థితుల్లో దీనిపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని బీసీసీఐ పేర్కొంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాకే, ప్రయాణ ఆంక్షలు సడలించాకే టోర్నీల గురించి ఆలోచిస్తామని తెలిపింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement