స్క్వాష్‌లో రెండు పతకాలు ఖాయం! | SQUASH Dipika wins grudge tie, Ghosal too in semis to assure 2 medals | Sakshi
Sakshi News home page

స్క్వాష్‌లో రెండు పతకాలు ఖాయం!

Sep 21 2014 7:57 PM | Updated on Sep 2 2017 1:44 PM

స్క్వాష్‌లో రెండు పతకాలు ఖాయం!

స్క్వాష్‌లో రెండు పతకాలు ఖాయం!

ఇప్పటిదాకా ఆసియా గేమ్స్‌లో మహిళలు స్క్వాష్‌ విభాగంలో వ్యక్తిగత పతకం సాధించలేదు.

ఇంచియాన్:ఇప్పటిదాకా ఆసియా గేమ్స్‌లో మహిళలు స్క్వాష్‌ విభాగంలో వ్యక్తిగత పతకం సాధించలేదు. ఈసారి ఆ లోటు తీరనుంది. తన పుట్టిన రోజు నాడు స్టార్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ మెరిసింది. సహచరురాలు జోష్న చినప్పతో జరిగిన సింగిల్స్ క్వార్టర్స్‌లో విజయం సాధించిన దీపిక తన ఖాతాలో కాంస్య పతకం ఖాయం చేసుకుంది. 1998 ఏషియాడ్‌లో ఈ క్రీడను ప్రవేశ పెట్టినప్పటినుంచి భారత సింగిల్స్ విభాగంలో క్రీడాకారిణులు పతకం అందుకోలేకపోయారు. అయితే హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో దీపిక 7-11, 11-9, 11-8, 15-17, 11-9 తేడాతో జోష్నను ఓడించి సెమీస్‌లో ప్రవేశించింది.

 

అటు పురుషుల సింగిల్స్‌లోనూ ఆసియా నంబర్ వన్ సౌరభ్ ఘోశల్ కూడా సెమీస్‌కు చేరి పతకంపై భరోసానిచ్చాడు.  భారత ఆటగాడు ఘోషల్ 11-6 9-11 11-2 11-9 పాకిస్తాన్ ఆటగాడు నజీర్ ఇక్బాల్ ను బోల్తా కొట్టించి పతకం ఖాయం చేసుకున్నాడు. దీంతో భారత్ తొలిసారిగా రెండు సింగిల్స్ విభాగాల్లో పతకాలు సాధించినట్లవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement