'పద్మభూషణ్ ' కు సైనా పేరు! | sports ministry decides to recommend saina nehwal name for padma bhushan | Sakshi
Sakshi News home page

'పద్మభూషణ్ ' కు సైనా పేరు!

Jan 5 2015 1:43 PM | Updated on Sep 2 2017 7:15 PM

'పద్మభూషణ్ ' కు సైనా పేరు!

'పద్మభూషణ్ ' కు సైనా పేరు!

ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ అవార్డు కోసం భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ను సిఫారు చేయనున్నట్లు కేంద్రం స్సష్టం చేసింది.

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ అవార్డు కోసం భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పేరును సిఫార్సు చేయడానికి కేంద్రం సిద్దమయ్యింది. ఈ అవార్డు కోసం సైనా చేసుకున్న దరఖాస్తు శనివారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు అందింది.  తొలుత ఆమె పేరును పద్మ భూషణ్ అవార్డుకు పంపే అవకాశాలను పరిశీలించిన పిదప అందుకు రంగం సిద్ధం చేసింది.
 

‘పద్మభూషణ్’ అవార్డు ఎంపిక కోసం తన దరఖాస్తును తిరస్కరించడంపై ఆమె ఆవేదనతోపాటు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఐదేళ్ల క్రితం ‘పద్మశ్రీ’ పొందిన తనకు నిబంధనల ప్రకారం ఈ అవార్డు పొందే అర్హత ఉందని, తనను కాదని రెజ్లర్ సుశీల్ కుమార్ పేరును ఎలా పరిగణనలోకి తీసుకున్నారని సైనా ప్రశ్నించింది. దీంతో డైలామాలో పడిన క్రీడామంత్రిత్వ శాఖ చివరకు సైనా పేరును పద్మభూషణ్ అవార్డుకు ప్రతిపాదించేందుకు సిద్దమయ్యింది.

Advertisement
 
Advertisement
Advertisement