ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదు : కేంద్ర మంత్రి | Sports Minister Vijay Goel explanation on rio issue | Sakshi
Sakshi News home page

ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదు : కేంద్ర మంత్రి

Aug 12 2016 3:44 PM | Updated on Sep 4 2017 9:00 AM

ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదు : కేంద్ర మంత్రి

ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదు : కేంద్ర మంత్రి

ప్రపంచ క్రీడల్లో అత్యున్నత ఈవెంట్ ఒలింపిక్స్ లో భారత క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ నిబంధనలను పాటించడం లేదని ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రపంచ క్రీడల్లో అత్యున్నత ఈవెంట్ ఒలింపిక్స్ లో భారత క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ నిబంధనలను పాటించడం లేదని ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రియోలో దేశ ఆటగాళ్లను కలుసుకునేందుకు తనతో పాటు అక్రిడిటేషన్ లేని వాళ్లను తీసుకెళ్తున్నారని ఒలింపిక్ అధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి విజయ్ గోయల్ స్పందించారు. రియోలో తాను ఎక్కడా ప్రొటోకాలు ఉల్లంఘించలేదని, ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించ లేదని పేర్కొన్నారు. నిబంధలను కచ్చితంగా పాటించి అధికారులకు సహకరించానని ట్వీట్ చేశారు. దేశం తరఫున ఇక్కడికి వచ్చిన ఆటగాళ్లను ప్రొత్సహించడం మాత్రమే చేశానన్నారు. అయితే ఈ విషయాన్ని ఒలింపిక్ సిబ్బంది తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చుకున్నారు.

మరోవైపు విజయ్ గోయల్ పై భారత చెఫ్ డి మిషన్ రాకేశ్ గుప్తాకు రాసిన లేఖలో రియో గేమ్స్ కాంటినెంటల్ మేనేజర్ సారా పీటర్సన్ ఫిర్యాదుచేశారు. క్రీడాశాఖ మంత్రి మా సిబ్బంది చెప్పినా వినిపించుకోవడం లేదని, దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. మరోసారి ఇలా జరిగితే మంత్రి గుర్తింపును రద్దు చేస్తామని ఇదివరకే హెచ్చరించిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement