భారత కెప్టెన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్‌ బౌలర్లు

Special Praise For Virat Kohli From Two Pakistani Fast Bowlers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సమకాలీన క్రికెట్‌లో స్థిరత్వంతో రాణిస్తున్న విరాట్‌ కోహ్లిని పాకిస్థాన్‌ అభిమానులు విపరీతంగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం పాక్‌ అభిమానులే కాకుండా ఆదేశ క్రికెటర్లు సైతం కోహ్లిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా పాక్‌ సీనియర్‌ బౌలర్‌ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌, యువ బౌలర్‌ మహ్మద్‌ ఇర్ఫాన్‌లు ట్విట్టర్‌ వేదికగా కోహ్లిని ఆకాశానికెత్తారు. కోహ్లి బౌలింగ్‌ చేయడమే ఓ గొప్ప అవకాశమని షోయబ్‌ ట్వీట్‌ చేయగా..  గొప్ప మనసున్న వ్యక్తి కోహ్లి అని ఇర్ఫాన్‌ ట్వీట్‌ చేశాడు.

‘కోహ్లి బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు నేను బౌలింగ్‌ చేస్తే అన్ని బంతులు మంచిగా వేయలేనేమో​.. కోహ్లి ఒక గొప్ప బ్యాట్స్‌మెన్‌, అతనికి బౌలింగ్‌ చేయడమే ఓ గొప్ప విశేషం’ -షోయబ్‌ అక్తర్‌ 
 

‘కోహ్లి ఓ జెంటిల్‌మన్‌.. గొప్ప మనుసున్న గొప్ప ఆటగాడు. నీ కోసం ప్రార్ధిస్తా మై డియర్‌ ఫ్రెండ్‌. మనం మైదానంలో తరుచుగా ఆడుతామని ఆశిస్తున్నా’.- మహ్మద్‌ ఇర్ఫాన్‌

ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న విరాట్‌.. ఈ ఇద్దరి క్రికెటర్లపై ప్రశంసలు కురిపించాడు. ‘ఇర్ఫాన్‌ బౌలింగ్‌ ఎదుర్కోవడం ఓ చాలెంజ్‌. దానికి కారణం అతని ఎత్తే. షోయబ్‌ బౌలింగ్‌ ఎప్పుడు ఎదుర్కోలేదు. కానీ అతని బంతి ప్రాణంతకమైందని దంబుల్లా మ్యాచ్‌లో అర్థమైంది. ఆమ్యాచ్‌లో త్వరగా అవుటవ్వడంతో అతని బౌలింగ్‌ ఎదుర్కోలేదు. కానీ అతని బంతి బ్యాట్స్‌మన్‌కు తగిలితే అంతే సంగతి. అతను బౌలింగ్‌ చేస్తున్నప్పుడు నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌ లో ఉండటమే మంచిది’. అని కోహ్లి ఆ షోలో పేర్కొన్నాడు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top