డేవిస్ కప్‌లో స్పెయిన్ ‘సిక్సర్’

మాడ్రిడ్ (స్పెయిన్): ప్రపంచ పురుషుల టెన్నిస్ టీమ్ చాంపియన్‌షిప్ డేవిస్ కప్ టైటిల్‌ను స్పెయిన్ జట్టు ఆరోసారి సొంతం చేసుకుంది. తుది పోరులో స్పెయిన్ 2–0తో కెనడాను ఓడించింది. తొలి సింగిల్స్‌లో అగుట్ 7–6 (7/3), 6–3తో ఫెలిక్స్ అగుర్‌పై నెగ్గి స్పెయిన్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. రెండో సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ 6–3, 7–6 (9/7)తో షపోవలోవ్ (కెనడా)ను ఓడించాడు. గతంలో స్పెయిన్ 2000, 2004, 2008, 2009, 2011లలో విజేతగా నిలిచింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి