నిలకడగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ | south africa gets 103 runs and lose two wickets after 20 overs | Sakshi
Sakshi News home page

నిలకడగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్

Oct 14 2015 7:00 PM | Updated on Sep 3 2017 10:57 AM

టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది.

ఇండోర్: టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. టీమిండియా విసిరిన 248 పరుగుల లక్ష్యాన్ని చేరే క్రమంలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది.  డు ప్లెసిస్(27), జేపీ డుమినీ(24)క్రీజ్ లో ఉన్నారు. దక్షిణాఫ్రికా ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(17),డీ కాక్(34) పెవిలియన్ కు చేరారు. టీమిండియా స్పిన్నర్లు హర్భజన్ సింగ్, అక్షర్ పటేల్ కు తలో వికెట్ లభించింది.

 

టాస్ గెలిచిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ధోని (92 నాటౌట్: 75 బంతుల్లో 4ఫోర్లు, 4 సిక్సర్లు) , అజింక్యా రహానే(51)లు రాణించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement