ఐటీఎఫ్ టోర్నీ విజేత సౌజన్య | soujanya wins itf singles title | Sakshi
Sakshi News home page

ఐటీఎఫ్ టోర్నీ విజేత సౌజన్య

Oct 30 2016 11:39 AM | Updated on Sep 4 2017 6:46 PM

అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో సింగిల్స్ టైటిల్‌ను హైదరాబాద్ అమ్మాయి సౌజన్య భవిశెట్టి సొంతం చేసుకుంది.

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో సింగిల్స్ టైటిల్‌ను హైదరాబాద్ అమ్మాయి సౌజన్య భవిశెట్టి సొంతం చేసుకుంది. పుణేలో శనివారం జరిగిన ఫైనల్లో సౌజన్య 7-5, 6-2తో భారత్‌కే చెందిన మిహికా యాదవ్‌ను ఓడించింది. గంటా 27 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో ఎడంచేతి వాటం క్రీడాకారిణి సౌజన్య ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది.

 

ఈ టోర్నీ మొత్తంలో సౌజన్య తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. 22 ఏళ్ల సౌజన్యకిది మూడో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్. 2013లో షర్మ్ ఎల్ షేక్ (ఈజిప్టు), 2014లో ఔరంగాబాద్‌లో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలలో సౌజన్య విజేతగా నిలిచింది.  

 

Advertisement
 
Advertisement
Advertisement