యూకీ xసోమ్‌దేవ్ | Somdev to play Yuki in semifinal of ATP Challenger | Sakshi
Sakshi News home page

యూకీ xసోమ్‌దేవ్

Feb 7 2014 1:07 AM | Updated on Sep 2 2017 3:24 AM

యూకీ  xసోమ్‌దేవ్

యూకీ xసోమ్‌దేవ్

ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో ఫైనల్ బెర్తు కోసం భారత ఆటగాళ్ల మధ్యే పోటీ జరగనుంది.

చెన్నై: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో ఫైనల్ బెర్తు కోసం భారత ఆటగాళ్ల మధ్యే పోటీ జరగనుంది. టాప్‌సీడ్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, ఏడో సీడ్ యూకీ బాంబ్రీలు సెమీఫైనల్‌లో ముఖాముఖి తలపడనున్నారు. గురువారం తనతో క్వార్టర్ ఫైనల్లో తలపడాల్సిన జోర్డీ మోంటానా (స్పెయిన్) కడుపునొప్పి కారణంగా పోటీ నుంచి వైదొలగడంతో సోమ్‌దేవ్‌కు వాకోవర్ లభించింది. కాగా, యూకీ  3-6, 6-2, 6-2తో లూయిస్ పౌలే (ఫ్రాన్స్)ను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.
 
 ఇక ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాకేత్ మైనేని ప్రస్థానం క్వార్టర్స్‌తో ముగిసింది. రష్యా ఆటగాడు అలెగ్జాండర్ కుద్రయెత్సెవ్ చేతిలో సాకేత్ 0-6, 2-6తో ఓటమిపాలయ్యాడు. మరో మ్యాచ్‌లో సనమ్‌సింగ్ 5-7, 4-6తో రెండో సీడ్ డాన్‌స్కాయ్ (రష్యా) చేతిలో ఓడాడు. మరోవైపు మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)తో కలిసి యూకీ బాంబ్రీ డబుల్స్‌లోనూ సెమీస్‌కు చేరాడు. క్వార్టర్స్‌లో యూకీ-వీనస్ జోడి 6-2, 6-3తో థామస్ ఫాబియానో-అగస్టిన్ వెలోటి జంటపై గెలుపొందింది. బాలాజీ-బ్లాజ్ రోలా ద్వయం సెమీఫైనల్‌కు చేరింది.
 

Advertisement
 
Advertisement
Advertisement