సోమ్‌దేవ్‌కే టైటిల్ | somdev devvarman title | Sakshi
Sakshi News home page

సోమ్‌దేవ్‌కే టైటిల్

Feb 23 2015 1:22 AM | Updated on Sep 2 2017 9:44 PM

ఏడాది కాలంగా ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్న భారత టెన్నిస్ అగ్రశ్రేణి క్రీడాకారుడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.

న్యూఢిల్లీ: ఏడాది కాలంగా ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్న భారత టెన్నిస్ అగ్రశ్రేణి క్రీడాకారుడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్ నిలబెట్టుకున్నాడు.
 
 ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సోమ్‌దేవ్ 3-6, 6-4, 6-0తో భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీని ఓడించాడు. గతేడాది ఢిల్లీ ఓపెన్‌ను గెల్చుకున్నాక సోమ్‌దేవ్ ఖాతాలో మరో టైటిల్ చేరలేదు. ఏడాది తర్వాత ఢిల్లీ ఓపెన్‌లోనే అతను చాంపియన్‌గా నిలువడం విశేషం.
 

Advertisement
 
Advertisement
Advertisement