లాథమ్ సెంచరీ | Solid Latham century leads NZ effort | Sakshi
Sakshi News home page

లాథమ్ సెంచరీ

Nov 18 2014 1:11 AM | Updated on Sep 2 2017 4:38 PM

లాథమ్ సెంచరీ

లాథమ్ సెంచరీ

పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టు స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శిస్తోంది.

దుబాయ్: పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టు స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శిస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ టామ్ లాథమ్ (258 బంతుల్లో 137 బ్యాటింగ్; 11 ఫోర్లు; 1 సిక్స్) అజేయ సెంచరీతో సోమవారం తొలి రోజు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 243 పరుగులు చేసింది. మరో ఓపెనర్ మెకల్లమ్ (69 బంతుల్లో 43; 4 ఫోర్లు; 2 సిక్సర్లు), కేన్ విలియమ్సన్ (86 బంతుల్లో 32; 1 ఫోర్) రాణించారు. 22 ఏళ్ల లాథమ్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా ఆసియాలో వరుసగా ఈ ఫీట్ సాధించిన యువ ఆసియేతర ఆటగాడుగా నిలిచాడు. పదేళ్ల అనంతరం కివీస్ నుంచి తొలి ముగ్గురు బ్యాట్స్‌మెన్ 30కి పైగా పరుగులు సాధించడం ఇదే మొదటిసారి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement