టీమిండియాకు భారీ షాక్‌ | Smriti Mandhana Ruled out The ODI Series Against South Africa | Sakshi
Sakshi News home page

టీమిండియాకు భారీ షాక్‌

Oct 9 2019 10:36 AM | Updated on Oct 9 2019 8:00 PM

Smriti Mandhana Ruled out The ODI Series Against South Africa - Sakshi

వడోదర :  కీలక దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు టీమిండియా మహిళల జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వన్డే ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాటర్‌, టీమిండియా ఓపెనర్‌ స్మృతి మంధాన బొటన వేలి గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌ నుంచి తప్పుకుంది. మంగళవారం ప్రాక్టీస్‌లో భాగంగా ఈ క్రికెటర్‌ బొటన వేలికి గాయమైంది. వైద్య పరీక్షల అనంతరం మంధానకు విశ్రాంతి అవసరవని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆమె స్థానంలో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక గత కొద్దికాలంగా టీమిండియా వన్డే విజయాల్లో స్మృతి మంధాన కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మంధాన గాయం కారణంగా దూరం కావడంతో బ్యాటింగ్‌ భారం మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లపై పడనుంది. 

ఇక దక్షిణాప్రికాతో మూడు వన్డేల సిరీస్‌ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక జట్టుకు తొలి ఓవర్‌ తొలి బంతికే గోస్వామి షాక్‌ ఇచ్చింది. లిజాలే లీ(0)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. అనంతరం ఏక్తా బిస్త్‌ రెండు వికెట్లతో విజృంభించడంతో 56 పరుగులకే మూడు కీలక వికెట్ల కోల్పోయి సఫారీ జట్టు కష్టాల్లో పడింది. అనంతరం మారిజాన్ కాప్(54) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో 45.1 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో గోస్వామి(3/33), పూనమ్‌ యాదవ్‌(2/33), ఏక్తా బిస్త్‌(2/28), శిఖా పాండే(2/38)లు రాణించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement