పీవీ సింధు కెరీర్లో తొలిసారి.. | Sindhu usurps Saina in rankings | Sakshi
Sakshi News home page

పీవీ సింధు కెరీర్లో తొలిసారి..

Nov 25 2016 4:40 PM | Updated on Sep 4 2017 9:06 PM

పీవీ సింధు కెరీర్లో తొలిసారి..

పీవీ సింధు కెరీర్లో తొలిసారి..

కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న తెలుగుతేజం పీవీ సింధు మరో ఘనత సాధించింది.

హైదరాబాద్‌: కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న తెలుగుతేజం పీవీ సింధు మరో ఘనత సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో సింధు తొలిసారి ఏస్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ను దాటి మెరుగైన స్థానంలో నిలిచింది.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌ జాబితాలో సింధు తొమ్మిదో స్థానం సాధించింది. కాగా సైనా టాప్‌-10లో చోటు కోల్పోయి 11వ ర్యాంకుకు పడిపోయింది. గత ఎనిమిదేళ్లలో సైనా టాప్‌-10లో స్థానం కోల్పోవడం ఇదే తొలిసారి. హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో సెమీస్‌లో సైనా, సింధు తలపడే అవకాశముంది. సింధు ఇప్పటికే సెమీస్‌ చేరగా, సైనా క్వార్టర్స్‌ ప్రత్యర్థిపై గెలవాల్సివుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement