ప్రిక్వార్టర్స్ కు హాలెప్ | Simona Halep Eases Into Wimbledon Fourth Round | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్ కు హాలెప్

Jul 2 2016 8:24 PM | Updated on Sep 4 2017 3:59 AM

ప్రిక్వార్టర్స్ కు హాలెప్

ప్రిక్వార్టర్స్ కు హాలెప్

ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో రొమేనియా క్రీడాకారిణి, ఐదో సీడ్ సిమోన్ హాలెప్ నాల్గో రౌండ్లోకి ప్రవేశించింది.

లండన్:ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో  రొమేనియా క్రీడాకారిణి, ఐదో సీడ్ సిమోన్ హాలెప్ నాల్గో రౌండ్లోకి ప్రవేశించింది. శుక్రవారం ఆలస్యంగా జరిగిన మూడో రౌండ్లో హాలెప్ 6-4, 6-3 తేడాతో అన్‌సీడెడ్ ప్లేయర్ కికి బెర్‌టెన్స్ (నెదర్లాండ్స్) పై గెలిచి ప్రిక్వార్టర్స్ లో కి దూసుకెళ్లింది. 

 

ఇప్పటివరకూ ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకోని హాలెప్ మాత్రం ఆద్యంత ఆకట్టుకుంది. తొలి రెండు సెట్లలో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసిన హాలెప్ మరో అడుగు ముందుకేసింది. గత ఫ్రెంచ్ ఓపెన్లో తొలి రౌండ్లోనే కెర్బర్ను ఓడించడంతో పాటు సెమీస్ చేరిన కికి బెరటెన్స్ .. ఈ టోర్నీ మూడో రౌండ్ లో ఎటువంటి ప్రతిఘటన లేకుండా టోర్నీ నుంచి నిష్ర్కమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement