breaking news
Kiki Bertens
-
ప్రిక్వార్టర్స్ కు హాలెప్
లండన్:ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో రొమేనియా క్రీడాకారిణి, ఐదో సీడ్ సిమోన్ హాలెప్ నాల్గో రౌండ్లోకి ప్రవేశించింది. శుక్రవారం ఆలస్యంగా జరిగిన మూడో రౌండ్లో హాలెప్ 6-4, 6-3 తేడాతో అన్‌సీడెడ్ ప్లేయర్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) పై గెలిచి ప్రిక్వార్టర్స్ లో కి దూసుకెళ్లింది. ఇప్పటివరకూ ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకోని హాలెప్ మాత్రం ఆద్యంత ఆకట్టుకుంది. తొలి రెండు సెట్లలో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసిన హాలెప్ మరో అడుగు ముందుకేసింది. గత ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే కెర్బర్‌ను ఓడించడంతో పాటు సెమీస్ చేరిన కికి బెరటెన్స్ .. ఈ టోర్నీ మూడో రౌండ్ లో ఎటువంటి ప్రతిఘటన లేకుండా టోర్నీ నుంచి నిష్ర్కమించింది. -
కెర్బర్ ఇంటిముఖం
* తొలి రౌండ్లోనే ఓడిన మూడో సీడ్ * కికి బెర్టెన్స్ సంచలనం * శ్రమించి నెగ్గిన ముర్రే పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మంగళవారం పెను సంచలనం నమోదైంది. ప్రస్తుత ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, మూడో సీడ్ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. అన్‌సీడెడ్ ప్లేయర్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) అద్భుత ఆటతీరుతో ఈ జర్మన్ స్టార్‌ను ఓడించి తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించింది. మూడు సెట్లపాటు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో బెర్టెన్స్ 6-2, 3-6, 6-3తో కెర్బర్‌పై గెలిచి రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది. మరోవైపు ఐదో సీడ్ విక్టోరియా అజరెంకా తొలి రౌండ్ ఓటమి నుంచి తప్పించుకొని ఊపిరి పీల్చుకుంది. కరీన్ నాప్ (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో అజరెంకా తొలి సెట్‌ను 3-6తో కోల్పోయి, రెండో సెట్‌ను 7-6 (8/6)తో గెలిచింది. నిర్ణాయక మూడో సెట్లో అజరెంకా 0-4తో వెనుకబడిన దశలో ఆమె ప్రత్యర్థి కరీన్ నాప్ గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 14వ సీడ్ ఇవనోవిచ్ (సెర్బియా) 6-0, 5-7, 6-2తో డోడిన్ (ఫ్రాన్స్)పై, తొమ్మిదో సీడ్ వీనస్ (అమెరికా) 7-6 (7/5), 7-6 (7/4)తో కొంటావీట్ (ఎస్తోనియా)పై, ఎనిమిదో సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 6-3, 6-1తో ఎస్పినోసా (స్పెయిన్)పై గెలి చారు. అయితే 20వ సీడ్ జొహనా కొంటా (బ్రిటన్), 23వ సీడ్ జంకోవిచ్ (సెర్బియా) తొలి రౌండ్లోనే ఓడిపోయారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఐదు సెట్ల పోరాటంలో నెగ్గి ఊపిరి పీల్చుకున్నాడు. స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్)తో జరిగిన తొలి రౌండ్లో ముర్రే 3-6, 3-6, 6-0, 6-3, 7-5తో నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-4, 6-1, 6-1తో యెన్ సున్ లు (చైనీస్ తైపీ)పై, ఐదో సీడ్ నాదల్ (స్పెయిన్) 6-1, 6-1, 6-1తో సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా)పై, ఆరో సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-4తో స్ట్రఫ్ (జర్మనీ)పై, ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-3, 6-2, 6-1తో పోస్పిసిల్ (కెనడా)పై, 11వ సీడ్ ఫెరర్ (స్పెయిన్) 6-1, 6-2, 6-0తో డాన్స్కాయ్ (రష్యా)పై గెలిచారు.