అతని కంటే మాలికే బెటర్‌: చహల్

Shoaib Malik Better Than Steve Smith In Spin, Yuzvendra Chahal - Sakshi

కోహ్లి, రోహిత్‌లే టాప్‌

విలియమ్సన్‌ది సెపరేట్‌ స్టైల్‌

న్యూఢిల్లీ: స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ మెరుగైన ఆటగాడు కాదంటూ భారత స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో స్మిత్‌ కంటే పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలికే ఎంతో బెటర్‌ అని వ్యాఖ్యానించాడు. తన కోణంలో చూస్తే మాలిక్‌ స్పిన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటాడని చహల్‌ పేర్కొన్నాడు. దీనిలో భాగంగా 2018 ఆసియాకప్‌లో మాలిక్‌ తనను ఎదుర్కొన్న తీరును చహల్‌ గుర్తు చేసుకున్నాడు. ‘ నేను ఆసియాకప్‌లో మాలిక్‌కు బౌలింగ్‌ చేశా. మంచి బంతులను సైతం మాలిక్‌ సమర్ధవంతంగా ఆడాడు. సింగిల్స్‌ తీస్తూ స్టైక్‌ రొటేట్‌ చేశాడు. దాంతో నాకు అర్థమైన విషయం ఏమిటంటే మాలిక్‌కు క్రికెట్‌లో విశేష అనుభవం ఉందనేది తెలిసింది. స్పిన్‌ ఆడటంలో స్మిత్‌ కంటే మాలిక్‌ ఎంతో బెటర్‌’ అని తెలిపాడు. (ఏది నమ్మాలో అర్థం కావట్లేదు: డివిలియర్స్‌)

ఈ జాబితాలో టీమిండియా క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలకు టాప్‌ ప్లేస్‌ కట్టబెట్టాడు. వీరిద్దరూ స్పిన్‌ను ఎదుర్కోవడంలో వారికి వారే సాటి  అని చహల్‌ తెలిపాడు. స్పిన్‌ను ఆడటంలో కోహ్లి, రోహిత్‌లు గనాణ్యమైన క్రికెటర్లే అని పేర్కొన్నాడు. ఇక న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ సైతం స్పిన్‌ను బాగా ఆడతాడని పేర్కొన్నాడు. స్పిన్‌ బౌలర్లను ఇరకాటంలోకి నెట్టడంలో విలియమ్సన్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నాడు. బంతిని చాలా ఆలస్యంగా ఆడుతూ స్పిన్‌ బౌలర్లకు పరీక్షగా నిలుస్తాడన్నాడు. 

ఇదిలా ఉంచితే, చహల్‌ చేస్తున్న టిక్‌టాక్‌ వీడియోలకు కోహ్లి మురిసిపోతున్న సంగతి తెలిసిందే. చహల్‌ చేసే వీడియోలో తెగ నవ్వు తెప్పిస్తున్నాయని అన్నాడు. ఇక వెస్టిండీస్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ అయితే చహల్‌ వీడియోలు విసుగు తెప్పిస్తున్నాయని సరదాగా ట్రోల్‌ చేశాడు.చహల్ నేను నీతో విసిగిపోతున్నా.. టిక్​టాక్ వీడియోలతో విసిగిస్తున్నావు. అందుకే నిన్ను బ్లాక్ చేస్తున్నా.. నిన్ను బ్లాక్ చేయాలని టిక్​టాక్​కు కూడా చెబుతా. ఇప్పటికిప్పుడు నువ్వు సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చెయ్. ఇక జీవితంలో నిన్ను కలవద్దని, చూడకూడదని అనునుకుంటున్నా' అంటూ గేల్ ఆట పట్టించాడు. (ఆ జాబితాలో ఇండియా ఆటగాళ్లు ఒక్కరు లేరు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top