సల్మాన్‌ జైలు శిక్షపై షోయబ్‌ అక్తర్‌ కామెంట్‌ | Shoaib Akhtar sad about 'friend' Salman's sentence | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ జైలు శిక్షపై షోయబ్‌ అక్తర్‌ కామెంట్‌

Apr 6 2018 11:56 AM | Updated on Apr 6 2018 12:33 PM

Shoaib Akhtar sad about 'friend' Salman's sentence  - Sakshi

షోయబ్‌ అక్తర్‌, సల్మాన్‌ ఖాన్‌(పాత చిత్రం)

ఇస్లామాబాద్‌ : బాలీవుడ్‌ కండల నటుడు సల్మాన్‌ ఖాన్‌ జైలు శిక్షపై రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌, పాకిస్తాన్‌ మాజీ దిగ్గజ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ ట్విటర్‌లో స్పందించారు. సల్మాన్‌ ఖాన్‌కు కృష్ణ జింకల వేట కేసులో శిక్ష పడటం పట్ల విచారం వ్యక్తం చేశారు. సల్మాన్‌కు ఐదేళ్ల శిక్ష విధించడం చాలా కఠినమని పేర్కొన్నారు. తన స్నేహితుడు సల్మాన్‌ ఖాన్‌కు ఐదు సంవత్సరాలు జైలు శిక్షపడటం చాలా బాధ కలిగిందని ట్విటర్‌ ద్వారా తెలిపారు.

కానీ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నానని వెల్లడించారు. సల్మాన్‌ కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు. త్వరలోనే సల్మాన్‌ తిరిగి వస్తాడని ఆశిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. కృష్ణ జింకలను వేటాడినట్లు నిరూపితం కావడంతో జోథ్‌పూర్‌ కోర్టు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ దేవ్‌ కుమార్‌ ఖత్రి గురువారం సల్మాన్‌ ఖాన్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించిన సంగతి తెల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement