ఫైనల్లో అమినేని శివాని | shivani in final of ITF juniors tourney | Sakshi
Sakshi News home page

ఫైనల్లో అమినేని శివాని

Sep 2 2017 10:40 AM | Updated on Sep 17 2017 6:18 PM

ఫైనల్లో అమినేని శివాని

ఫైనల్లో అమినేని శివాని

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్స్‌ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి శివాని అమినేని టైటిల్‌ పోరుకు సిద్ధమైంది.

ఐటీఎఫ్‌ జూనియర్స్‌ టోర్నీ


సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్స్‌ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి శివాని అమినేని టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. ఎల్బీ స్టేడియం ‘శాట్స్‌’ కాంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్‌ సెమీఫైనల్లో రెండో సీడ్‌ శివాని 4–6, 7–5, 6–4తో నాలుగో సీడ్‌ తనీష కశ్యప్‌పై విజయం సాధించింది. మరో సెమీస్‌లో ఆకాంక్ష భాన్‌ 6–2, 6–1తో శివాని స్వరూప్‌ ఇంగ్లేపై నెగ్గింది. శనివారం శివాని, ఆకాంక్షల మధ్య ఫైనల్‌ పోరు జరగనుంది.

 

బాలుర సింగిల్స్‌ సెమీఫైనల్లో అభిమన్యు వన్నెం రెడ్డి 6–1, 5–7, 6–1తో భార్గవ్‌ పటేల్‌పై, సచిత్‌ శర్మ 6–3, 6–3తో కరణ్‌ శ్రీవాస్తవపై గెలిచారు. బాలికల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శ్రావ్య శివాని–తనీష కశ్యప్‌ జంట 6–4, 6–1తో సోనాషి భట్నాగర్‌–జాన్వీ పటేల్‌ జోడీపై, ఆలియా–శివాని స్వరూప్‌ ద్వయం 6–2, 6–0తో సిమెలి–చంద్రిక జోషి జంటపై, సాయి దేదీప్య–భక్తి పార్వణి జోడీ 7–5, 6–1తో దివ్య వాణి–శ్రేయ ద్వయంపై, శ్రీవల్లి రష్మిక–హుమేరా బేగం జంట 6–2, 6–2తో శివాని అమినేని–సల్సా అహెర్‌ జోడీపై గెలుపొందాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement