శివానికి నిరాశ | shivani defeated in itf tourny | Sakshi
Sakshi News home page

శివానికి నిరాశ

Jan 6 2017 10:22 AM | Updated on Sep 5 2017 12:35 AM

శివానికి నిరాశ

శివానికి నిరాశ

అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ సర్క్యూట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి అమినేని శివాని పోరాటం ముగిసింది.

చండీగఢ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ సర్క్యూట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి అమినేని శివాని పోరాటం ముగిసింది. గురువారం జరిగిన సింగిల్స్, డబుల్స్ మ్యాచ్‌ల్లో శివాని పరాజయం పాలైంది. స్థానిక సీఎల్‌టీఏ టెన్నిస్ స్టేడియంలో గురువారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో రియా వర్మ (భారత్) 6-3, 7-6 (5)తో శివానిపై గెలుపొందింది.

 

డబుల్స్ సెమీస్ మ్యాచ్‌లో శివాని- వైదేహి చౌదరీ (భారత్) జంట 3-6, 3-6తో కున్ రుు లీ- మనంచయ సావంగ్ జోడీ చేతిలో ఓడిపోరుుంది.  ఇతర బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో మెహక్ జైన్ (భారత్) 6-0, 6-0తో వైదేహి చౌదరీపై, అక్సానా మరీన్ (బెల్జియం) 6-3, 6-1తో ఆకాంక్ష భాను (భారత్)పై, థసపోర్న్ (థారుులాండ్) 6-1, 6-1తో తనీషా కశ్యప్ (భారత్)పై విజయం సాధించారు.

 ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

 బాలుర సింగిల్స్ క్వార్టర్స్: సిద్ధాంత్ బాంటియా (భారత్) 6-2, 7-5తో టోంక్లా ములదా (థారుులాండ్)పై, ధ్రువ్ సునీశ్ (భారత్) 6-2, 6-2తో దోస్టాన్‌బెక్ తశ్బులటోవ్ (కజకిస్థాన్)పై గెలుపొందారు.


 బాలుర డబుల్స్ సెమీస్: వశిష్ట్ చెరకు- జాక్ జోడీ 6-2, 6-4తో సిద్ధాంత్ బాంటియా- పరీక్షిత్ సోమని జంటపై నెగ్గింది.   
 

Advertisement
 
Advertisement
Advertisement