క్వార్టర్స్‌లో వికాస్, శివ | Shiva Thapa, Vikas Krishan advance to quarters in World Boxing Championships | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో వికాస్, శివ

Oct 8 2015 11:41 PM | Updated on Sep 3 2017 10:39 AM

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు సత్తా చాటారు. వికాస్ కృషణ్ (75 కేజీ), శివ తాపా (56 కేజీ)లు క్వార్టర్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు.

దోహా: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు సత్తా చాటారు. వికాస్ కృషణ్ (75 కేజీ), శివ తాపా (56 కేజీ)లు క్వార్టర్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో వికాస్ 2-1తో నాలుగోసీడ్ తోమస్ జబ్లనోస్కి (పోలెండ్)పై నెగ్గాడు. హోరాహోరీగా సాగిన ఈ బౌట్‌లో ప్రత్యర్థి అటాకింగ్‌కు దిగినా వికాస్ అప్పర్ కట్స్, రైట్ హుక్స్‌తో సమర్థంగా నిలువరించాడు. మరో బౌట్‌లో శివ... ఆఫ్రికా చాంపియన్ మహ్మద్ హమోట్ (మొరాకో)ను ఓడించాడు. కేవలం 26 సెకన్లలోనే ప్రత్యర్థిని నాకౌట్ చేశాడు. రెండు, మూడో రౌండ్‌లలో శివ కొట్టిన లెఫ్ట్ హుక్‌లు బౌట్‌కే హైలెట్‌గా నిలిచాయి. నుదురుపై కొట్టిన పంచ్‌లకు హమోట్ దిమ్మతిరిగి పడిపోయాడు. దీంతో ఎనిమిది అంకెలు లెక్కపెట్టాక అత్యవసరంగా వైద్య బృందాన్ని పిలిపించి చికిత్స చేయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement