కుమార్తెకి గబ్బర్‌ భావోద్వేగ ట్వీట్‌‌  | Shikhar Dhawan posts the cutest video on daughter birthday | Sakshi
Sakshi News home page

కుమార్తెకి గబ్బర్‌ భావోద్వేగ ట్వీట్‌‌ 

May 5 2018 4:28 PM | Updated on May 6 2018 6:57 PM

Shikhar Dhawan posts the cutest video on daughter birthday - Sakshi

భార్య, పిల్లలతో ధావన్‌

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శిఖ‌ర్ ధావ‌న్ ప్ర‌స్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్ శనివారం రాత్రి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడనుంది. మరో వైపు శిఖర్‌ ధావ‌న్‌కు మాత్రం ఈరోజు ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే మే 5 తన కుమార్తె అలియా పుట్టిన రోజు. అయితే తన కూతురు పుట్టిన రోజున అమె పక్కన లేకపోవడంతో ఎంతో బాధపడుతున్నట్టు గబ్బర్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

 ఈ నేప‌థ్యంలో శిఖ‌ర్ ట్విట‌ర్ ద్వారా అలియాకు విషెస్ చెబుతూ ఓ భావోద్వేగ‌ వీడియోను పోస్ట్ చేశాడు. `హ్యాపీ బ‌ర్త్‌డే మై ఏంజెల్. నీలాంటి మంచి మ‌న‌స్త‌త్వ‌మున్న కూతురు ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉంది. నీ బ‌ర్త్‌డే రోజు మ‌నం క‌లిసి సెల‌బ్రేట్ చేసుకోలేక‌పోవ‌డం చాలా బాధ‌గా ఉంది. నేనెక్క‌డ ఉన్నా నా మ‌న‌సెప్పుడూ నీ ద‌గ్గ‌రే ఉంటుందని’ ధావ‌న్ ట్వీట్ చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement