నా జీవితంలో నువ్వు ఉండటం అదృష్టం: తండ్రికి తనయుడి విషెస్ | Ram Charan Special Wishes To Megastar Chiranjeevi on His Birthday | Sakshi
Sakshi News home page

Ram Charan: 'నా మొదటి హీరో నువ్వే నాన్న'.. రామ్ చరణ్ స్పెషల్ విషెస్

Aug 22 2026 7:02 PM | Updated on Aug 22 2026 7:02 PM

Ram Charan Special Wishes To Megastar Chiranjeevi on His Birthday

ఇవాళ మెగాస్టార్ చిరంజీవి బర్త్‌ డే కావడంతో తనయుడు రామ్ చరణ్ స్పెషల్ విషెస్ తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న అంటూ తన ప్రేమను చాటుకున్నారు. నా మొదటి హీరో, నా గొప్ప స్ఫూర్తి, నేను ఎల్లప్పుడూ ఆశ్రయించగలిగే వ్యక్తివి నువ్వేనంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. నా జీవితంలోని ప్రతి సుఖదుఃఖంలో, నీ ప్రేమ, మార్గదర్శనం, నాపై నీకున్న నమ్మకమే నాకు అతిపెద్ద బలమని ట్వీట్ చేశారు.

నా జీవితంలో నువ్వు ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నానని రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. నీకు మంచి ఆరోగ్యం, సంతోషం, రాబోయే కాలంలో మరెన్నో సంవత్సరాలు మీరు మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నానని తండ్రిపై అప్యాయత కురిపించారు. నిన్ను మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నా నాన్న అంటూ తనయుడిగా తన ప్రేమను పంచుకున్నారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఫ్యాన్స్‌ సైతం మెగాస్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement