ఎట్టకేలకు గుడ్‌న్యూస్.. విశ్వంభర అప్‌డేట్ వచ్చేసింది | Vishwambhara Makers Update on Megastar chiranjeevi Birthday | Sakshi
Sakshi News home page

Vishwambhara Movie: మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. విశ్వంభర అప్‌డేట్ ఇదే

Aug 22 2026 6:33 PM | Updated on Aug 22 2026 6:34 PM

Vishwambhara Makers Update on Megastar chiranjeevi Birthday

చిరంజీవి హీరోగా వస్తోన్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్‌ మూవీ ‘విశ్వంభర’. ఈ మూవీకి బింబిసార ఫేమ్  వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ కావాల్సిన ఈ చిత్రం.. ఇప్పటి వరకు విడుదల కాలేదు. వీఎఫ్ఎక్స్ (VFX)పై ఎక్కువ సమయం కేటాయించడంతో విడుదల విషయంలో ఆలస్యమైంది.

జూలైలోనైనా థియేటర్లకు వస్తుందనుకుంటే అదీ కూడా జరగలేదు. ఆ తర్వాత ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఇక ఫ్యాన్స్ కూడా విశ్వంభర చిత్రాన్ని మరిచిపోయేలా ఉన్నారు. కానీ తాజాగా మెగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇవాళ మెగాస్టార్ బర్త్ డే కావడంతో ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పారు. 

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర మూవీ ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్ చేశారు. దీంతో పాటు ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ఆడియో విడుదల చేశారు. దాదాపు ఓ నిమిషం పాటు ఉన్న ఈ ఆడియో మెగా ఫ్యాన్స్‌కు ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్, విక్రమ్‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మెగాస్టార్ సరసన త్రిష, ఆషికా రంగనాథ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement