నేను రూట్‌తో అన్నది ఇదే.. | Shannon Gabriel sorry for asking Joe Root if he liked boys | Sakshi
Sakshi News home page

నేను రూట్‌తో అన్నది ఇదే..

Feb 15 2019 11:30 AM | Updated on Feb 15 2019 11:30 AM

Shannon Gabriel sorry for asking Joe Root if he liked boys - Sakshi

సెయింట్‌ లూసియా: ఇంగ్లండ్‌ క్రికెట్‌ కెప్టెన్‌ జోరూట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వెస్టిండీస్‌ పేసర్‌ షానన్‌ గాబ్రియేల్‌పై నాలుగు వన్డేల నిషేధం పడిన సంగతి తెలిసిందే. అయితే రూట్‌తో తాను ఏమన్నది అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) విచారణలో గాబ్రియేల్‌ వెల్లడించాడు. తాను కేవలం నీకు పురుషులంటే ఇష్టమా అని మాత్రమే అడిగానని, గే అన్న పదంతో తనకు సంబంధం లేదన్నాడు.

‘మూడో టెస్ట్‌ మూడో రోజు ఆటలో మేం ఒత్తిడిలో ఉన్న సమయంలో బౌలింగ్‌కు దిగా. అప్పుడు రూట్‌ నన్ను చూసి నవ్వాడు. అటువంటి పరిస్థితుల్లో నవ్వడం ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసే వ్యూహం అయి ఉండొచ్చు. దాంతో ఎందుకు నవ్వుతున్నావు రూట్‌. నీకు పురుషులంటే ఇష్టమా అని అడిగా’ అని గాబ్రియెల్‌ వెల్లడించాడు. అందుకు రూట్‌.. ‘గే అన్న పదాన్ని గేలి చేసేందుకు ఉపయోగించకు. గే గా ఉండడంలో తప్పులేదని రూట్‌ బదులిచ్చాడు. అయితే గే అన్న దానితో నాకు సంబంధంలేదు. నువ్వు మాత్రం నన్ను చూసి నవ్వడం ఆపు అని రూట్‌కు సమాధానమిచ్చా’ అని మాత్రమే రూట్‌కు సమాధానమిచ్చానని గాబ్రియెల్‌ తెలిపాడు.

ఇక్కడ చదవండి: విండీస్‌ పేసర్‌పై 4 వన్డేల నిషేధం

గే అయితే తప్పేంటి?: జో రూట్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement