అశ్విన్, షమీ ర్యాంక్లు మెరుగు | Shami, Ashwin move up, Kohli, Dhoni drop in ICC rankings | Sakshi
Sakshi News home page

అశ్విన్, షమీ ర్యాంక్లు మెరుగు

Mar 2 2015 7:59 PM | Updated on Sep 2 2017 10:11 PM

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత బౌలర్లు అశ్విన్, మహ్మద్ షమీ స్థానాలు మెరుగుపడ్డారు.

సిడ్నీ: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత బౌలర్లు అశ్విన్, మహ్మద్ షమీ స్థానాలు మెరుగుపడ్డారు. కాగా టీమిండియా కెప్టెన్ ధోనీ, యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ ర్యాంక్లు దిగజారాయి.

తాజా జాబితాలో షమీ 14 స్థానాలు సంపాదించి 11 స్థానానికి ఎగబాకాడు.  అశ్విన్ 6 స్థానాలు మెరుగుపరుచుకుని 16వ ర్యాంక్కు చేరుకున్నాడు. ప్రపంచ కప్లో వీరిద్దరూ రాణించడంతో వీరి ర్యాంక్లు మెరుగయ్యాయి. బ్యాటింగ్ జాబితాలో కోహ్లీ ఓ స్థానం,  ధోనీ రెండు స్థానాలు కోల్పోయి వరసగా 4, 10వ ర్యాంక్లకు దిగజారారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిల్లీర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సంగక్కర, ఆమ్లా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement