‘ధోనిని 4వ స్థానంలో పంపండి’ | Sakshi
Sakshi News home page

‘ధోనిని నాలుగో స్థానంలో పంపండి’

Published Sun, Feb 18 2018 3:42 PM

Send Dhoni At 4 in Batting Order Says Sehwag - Sakshi

న్యూఢిల్లీ : మాజీ కెప్టెన్‌ ధోనిని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో పంపితే బావుంటుందని వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డారు. అవసరమైన సమయంలో ఆపద్భాందవుడిలా జట్టును ఆదుకోవడంలో ముందుండే మహేంద్ర సింగ్‌ ధోని ట్వంటీ-20 ఫార్మాట్‌లో గత కొంతకాలంగా క్రీజులో నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో మూడు ట్వంటీ-20ల్లో ధోని బరిలోకి దిగనున్నాడు. 

మిడిల్ ఆర్డర్‌లో మనీష్ పాండే, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యాల తర్వాత ధోనీ బ్యాటింగ్‌కు వస్తున్నాడు. చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేస్తుండటంతో కుదురుకోవడానికి సమయం దొరకడం లేదు. దీంతో పెద్దగా పరుగులేమీ చేయకుండా వెనుదిరగాల్సి వస్తోంది. 

దీని గురించి సెహ్వాగ్ మాట్లాడుతూ.. ధోనీకి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ కల్పిస్తే బావుంటుందని అన్నాడు. నాలుగో స్థానంలో ధోనిని పంపడం వల్ల భారీ స్కోరు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పాడు. ఈ విషయం కోహ్లికి తెలుసని, ధోని త్వరగా అవుటైతే తర్వాత పరిస్థితి ఏంటి? అనే ఉద్దేశంతోనే ఆ ధైర్యం చేయడం లేదేమోనని అన్నాడు.

ఈ విషయంపై ఎలాంటి డైలమా అవసరం లేదని చెప్పాడు. మనీష్ పాండే, హార్దిక్, జాదవ్‌ల్లో ఒకరికి ఇన్నింగ్స్‌ ఫినిషింగ్‌ బాధ్యతను అప్పజెప్పడమే బెటరని సూచించాడు. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌కు ట్వంటీ-20ల్లో మంచి రికార్డే ఉంది. ధోని సారథ్యంలోని టీమిండియా 2007లో టీ-20 ప్రపంచకప్‌ను గెలుపొందింది.

Advertisement
Advertisement