ఇప్పటికీ సెహ్వాగ్‌ అదే జోష్‌ | Sehwag returns to pitch, smashes opposition bowlers out of the park | Sakshi
Sakshi News home page

సెహ్వాగ్‌.. ఫోర్‌, సిక్స్‌, ఫోర్‌

Sep 10 2018 1:10 PM | Updated on Sep 10 2018 8:06 PM

 Sehwag returns to pitch, smashes opposition bowlers out of the park - Sakshi

టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ క్రికెట్‌ అభిమానులందరికీ సుపరిచితమే.

బెంగళూరు: టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ క్రికెట్‌ అభిమానులందరికీ సుపరిచితమే. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన వీరూ.. అప్పుడప్పుడు పరిమిత ఓవర్ల లీగ్‌లో కనువిందు చేస్తునే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి బ్యాట్‌ పట్టాడు సెహ్వాగ్‌.

బెంగళూరులో కర్ణాటక చలన చిత్ర కప్‌(కేసీసీ) పేరిట చిన్నస్వామి స్టేడియంలో ఈ నెల 8, 9 తేదీల్లో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఈ 10 ఓవర్ల మ్యాచ్‌ల్లో నటులు, కర్ణాటకకు చెందిన క్రికెటర్లతో పాటు కొందరు మాజీ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. అయితే దక్షిణాది నటుడు కిచ్చా సుదీప్‌ కెప్టెన్‌గా ఉన్న కదంబ లయన్స్‌ జట్టులో సెహ్వాగ్‌ సభ్యుడు. దీనిలో భాగంగా ఓ మ్యాచ్‌లో సెహ్వాగ్‌ బ్యాట్‌తో అలరించాడు. మరోసారి బ్యాట్‌ పడితే ఎలా ఉంటుందో సెహ్వాగ్‌ రుచి చూపించాడు. ఓపెనర్‌గా దిగిన సెహ్వాగ్‌.. తొలి ఓవర్‌లోనే ఫోర్‌, సిక్స్‌, ఫోర్‌ కొట్టి తన సత్తా చూపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement