హంగేరి గ్రాండ్ ప్రీ విజేత వెటెల్ | sebastian vettel wins hungarian GP | Sakshi
Sakshi News home page

హంగేరి గ్రాండ్ ప్రీ విజేత వెటెల్

Jul 26 2015 7:39 PM | Updated on Sep 3 2017 6:13 AM

హంగేరి గ్రాండ్ ప్రీ విజేత వెటెల్

హంగేరి గ్రాండ్ ప్రీ విజేత వెటెల్

హంగేరి ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీలో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు.

బుడాపెస్ట్: హంగేరి ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీలో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్ రేసును వెటెల్ ప్రథమ స్థానంతో పూర్తిచేశాడు. రెడ్ బుల్ డ్రైవర్లు డానిల్ క్వియాట్, డానియల్ రికియార్డో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

కాగా ఈ ఏడాది ఫార్ములా వన్ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయీస్ హామిల్టన్ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. శనివారం క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ పోల్ పొజిషన్ సాధించినా ఫైనల్ రేసులో వెనుకబడ్డాడు.

Advertisement
 
Advertisement
Advertisement