కొత్త భాగస్వామి కోసం అన్వేషణ: పేస్ | search for a new partner: the pace | Sakshi
Sakshi News home page

కొత్త భాగస్వామి కోసం అన్వేషణ: పేస్

Oct 26 2016 11:27 PM | Updated on Sep 4 2017 6:23 PM

తన కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గాలనే లక్ష్యం పెట్టుకున్నానని...

పుణే: తన కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గాలనే లక్ష్యం పెట్టుకున్నానని... వచ్చే ఏడాది దీనిని సాకారం చేసుకునేందుకు కొత్త భాగస్వామి కోసం అన్వేషణ చేస్తున్నానని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తెలిపాడు. ఇప్పటికే కెరీర్‌లో 18 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్న పేస్‌కు ఈ ఏడాది అంతగా కలసిరాలేదు.

ఈ సంవత్సరం ఇప్పటివరకు అతను ఏటీపీ సర్కూ ్యట్‌లో ఒక్క టైటిల్‌నూ గెలవలేదు. చాలెంజర్ స్థారుులో మాత్రం రెండు టైటిల్స్ సాధించాడు. పుణే ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత్‌కే చెందిన రామ్‌కుమార్‌తో బరిలోకి దిగిన పేస్ తొలి రౌండ్‌లో గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. 1991లో ప్రొఫెషనల్‌గా మారిన పేస్ ఇప్పటివరకు పురుషుల డబుల్స్‌లో 110 మంది భాగస్వాములతో... మిక్స్‌డ్ డబుల్స్‌లో 24 మంది భాగస్వాములతో కలిసి ఆడాడు. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement