టైటిల్‌ పోరుకు సంజన | sanjana ready to title fight | Sakshi
Sakshi News home page

టైటిల్‌ పోరుకు సంజన

Jul 7 2017 10:51 AM | Updated on Sep 5 2017 3:28 PM

టైటిల్‌ పోరుకు సంజన

టైటిల్‌ పోరుకు సంజన

అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) అండర్‌–18 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సంజన ఫైనల్లోకి అడుగు పెట్టింది.

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) అండర్‌–18 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సంజన ఫైనల్లోకి అడుగు పెట్టింది. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఈ టోర్నీ జరుగుతోంది. సెమీఫైనల్లో 12 ఏళ్ల సంజన 6–3, 6–2తో టాప్‌ సీడ్‌ భక్తి షాపై సంచలన విజయాన్ని సాధించింది.

 

ఈ టోర్నీలో క్వాలిఫయర్స్‌ ఆడి మెయిన్స్‌కు అర్హత సాధించిన సంజన తొలి రౌండ్‌లో 9–4తో పూర్వ రెడ్డిపై, రెండో రౌండ్‌లో 6–3, 6–0తో నాలుగో సీడ్‌ వుదులా రెడ్డిపై, క్వార్టర్స్‌లో 6–3, 6–3తో మూడో సీడ్‌ కిరణ్‌ రాణిపై గెలుపొందింది.
 

Advertisement
 
Advertisement
Advertisement