ఖేల్ రత్న అవార్డుకు సానియా పేరు | Sania recommended for Khel Ratna | Sakshi
Sakshi News home page

ఖేల్ రత్న అవార్డుకు సానియా పేరు

Aug 1 2015 4:54 PM | Updated on Sep 3 2017 6:35 AM

ఖేల్ రత్న అవార్డుకు సానియా పేరు

ఖేల్ రత్న అవార్డుకు సానియా పేరు

రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు వింబుల్డన్ డబుల్స్ చాంపియన్ సానియా మీర్జా పేరును ప్రతిపాదిస్తూ క్రీడాశాఖ నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ: రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు వింబుల్డన్ డబుల్స్ చాంపియన్ సానియా మీర్జా పేరును  ప్రతిపాదిస్తూ క్రీడాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్లో నెగ్గిన గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి మహిళగా రికార్డు సాధించారు. ఆటల్లో ఎక్కువ పతకాలు సాధించిన క్రీడాకారిణి కనుకనే సానియా పేరును ప్రతిపాదిస్తున్నామని క్రీడా శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్, కార్యదర్శి అజిత్ శరణ్ అన్నారు.

ప్రస్తుతానికి పేరును ప్రతిపాదించామని ఇంకా తుది నిర్ణయం వెలువడలేదని ఆయన తెలిపారు. సానియా ఇప్పటికే మూడు మిక్స్డ్ డబుల్స్ నెగ్గింది. పోటీకి అర్హురాలే అని వారు తెలిపారు. అదే విధంగా ఈ పోటీలో స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement