ఈ క్షణం ఎంతో ఉద్వేగభరితంగా ఉంది!! | Sania Mirza Shoaib Malik Blessed With A Baby Boy News Announced On Social Media | Sakshi
Sakshi News home page

మీర్జామాలిక్‌ వచ్చేశాడు!!

Oct 30 2018 8:37 AM | Updated on Apr 3 2019 4:08 PM

Sania Mirza Shoaib Malik Blessed With A Baby Boy News Announced On Social Media - Sakshi

నా శ్రీమతి ఎప్పటిలాగానే చాలా స్ట్రాంగ్‌గా ఉంది.

టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా- క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందారు. మంగళవారం ఉదయం సానియా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె భర్త షోయబ్‌ మాలిక్‌ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ.. ‘ఈ శుభవార్తను మీతో పంచుకోవడం ఎంతో ఉద్వేగభరితంగా ఉంది. మగబిడ్డ.. నా శ్రీమతి ఎప్పటిలాగానే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మీ ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలకు కృతఙ్ఞతలు’ అంటూ ట్వీట్‌ చేశాడు. దీంతో సోషల్‌ మీడియాలో సానియా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘ ఈ క్షణం ఎంతో ఉద్వేగభరితంగా ఉంది. ఇరుదేశాలకు అభినందనలు’ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌, సానియా బెస్ట్‌ఫ్రెండ్‌ ఫరాఖాన్‌ కూడా..‘చాలా రోజుల తర్వాత శుభవార్త విన్నాను. సానియా- మాలిక్‌ దంపతులకు అభినందనలు. అమ్మమ్మా తాతయ్యలుగా మారిన ఆనమ్‌-ఇమ్రాన్‌ మీర్జాలకు కూడా. ఆ దేవుడు మన బుల్లి రాకుమారుడిని దీవిస్తాడు.’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement