అన్నీ సర్దుకుంటాయి: సానియా మీర్జా

Sania Mirza Says Pregnancy Won’t End Her Tennis Career - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా మాతృత్వం ఆశయాలకు అడ్డంకి కాబోదంటోంది. త్వరలోనే తల్లిని కాబోతున్నట్లు ప్రకటించిన సానియా... ‘గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నా. గతేడాది అక్టోబర్‌ మధ్య నుంచి ఆటకు విరామం ఇచ్చాను. 2020 టోక్యో ఒలింపిక్స్‌ కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నా. అమ్మతనం నా ఆశయాలకు అడ్డురాదు. తల్లి కావడమనేది నాకే కాదు ప్రతీ ఒక్కరికి ఓ అద్భుతం, అదృష్టం. గర్భిణిని కావడంతో బరువు పెరిగిన మాట వాస్తవమే. అయితే అది ఎవరికైనా అంతే. తిరిగి బరిలో దిగితే అన్నీ సర్దుకుంటాయి.

నాకు పుట్టబోయే బిడ్డ నా కలలను చెరిపేయదు. నిజానికి ఆ బిడ్డ నా ఉత్సాహానికి ప్రేరణగా నిలుస్తుంది. తల్లిగా మారాక టెన్నిస్‌లో రాణించిన వారిలో నా పేరు ప్రముఖంగా వినిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ప్రస్తుతం నా బిడ్డ భవిష్యత్తు నాకు ముఖ్యం. అలాగని నాకెంతో ఇష్టమైన ఆటను వదిలేయను. బిడ్డ తర్వాత నేను అధిక ప్రాధాన్యం ఇచ్చేది టెన్నిస్‌కే’ అని తెలిపింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top