సానియా జంటకు షాక్‌ | sania mirza loss the game | Sakshi
Sakshi News home page

సానియా జంటకు షాక్‌

May 12 2017 1:37 AM | Updated on Sep 5 2017 10:56 AM

సానియా జంటకు షాక్‌

సానియా జంటకు షాక్‌

తన కొత్త భాగస్వామి యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్‌)తో కలిసి బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లో భారత స్టార్‌ సానియా

మాడ్రిడ్‌: తన కొత్త భాగస్వామి యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్‌)తో కలిసి బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లో భారత స్టార్‌ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. మాడ్రిడ్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టోర్నమెంట్‌లో నాలుగో సీడ్‌ సానియా–ష్వెదోవా జంట క్వార్టర్‌ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది.

గురువారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సానియా–ష్వెదోవా జోడీ 3–6, 6–3, 6–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఇరీనా కమెలియా బేగూ–సిమోనా హలెప్‌ (రొమేనియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను మూడుసార్లు చొప్పున కోల్పోయాయి. అయితే సూపర్‌ టైబ్రేక్‌లో మాత్రం సానియా జంట తడబడి మూల్యం చెల్లించుకుంది. క్వార్టర్స్‌లో ఓడిన సానియా జోడీకి 40,740 యూరోల (రూ. 28 లక్షల 53 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 215 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

Advertisement
 
Advertisement
Advertisement