సానియా మీర్జా ఆశలపై నీళ్లు | Sania Mirza-HoriaTecau lose in Australian Open mixed doubles | Sakshi
Sakshi News home page

సానియా మీర్జా ఆశలపై నీళ్లు

Jan 26 2014 1:19 PM | Updated on Sep 2 2017 3:02 AM

సానియా మీర్జా ఆశలపై నీళ్లు

సానియా మీర్జా ఆశలపై నీళ్లు

మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాలన్న భారత స్టార్ సానియా మీర్జా కల నెరవేరలేదు.

మెల్బోర్న్: మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాలన్న భారత స్టార్ సానియా మీర్జా కల నెరవేరలేదు. ఆస్ట్రేలియా ఓపెన్ రెండో టైటిల్ నెగ్గాలన్న ఆమె కోరిక తీరలేదు. ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది.

ఆదివారం జరిగిన తుదిపోరులో సానియా మీర్జా-హొరియా టెకావ్ (రుమేనియా) జోడి పరాజయం పాలయింది. క్రిస్టియానా మ్లాడినోవిక్(ఫ్రెంచ్)-డానియన్ నెస్టర్(కెనడా) జోడి చేతిలో 3-6 2-6తో ఓడిపోయింది. 58 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా-టెకావ్ జంట కనీస పోరాట పటిమ కూడా కనబరచలేకపోయింది. ప్రత్యర్థుల ముందు తేలిగ్గా తలవంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement