
న్యూఢిల్లీ: కాలి గాయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫిబ్రవరి తొలి వారంలో జరిగే ఫెడ్ కప్ టోర్నీకి దూరమయ్యే అవకాశాలు న్నాయి. ఆమె ఇంకా పూర్తిగా కోలుకోలేదని, త్వర లోనే గాయాన్ని పరీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని సానియా తండ్రి ఇమ్రాన్ వెల్లడించారు. మరోవైపు ఫెడ్ కప్ వేదికను చైనా నుంచి కజకిస్తాన్‌కు మార్చినట్లు ఐటీఎఫ్ తెలిపింది.