భారత్‌పై దూకుడుగా ఆడాల్సిందే: సంగక్కర | Sangakkara wants 'arrogant' Sri Lanka to challenge India | Sakshi
Sakshi News home page

భారత్‌పై దూకుడుగా ఆడాల్సిందే: సంగక్కర

Jun 7 2017 12:53 AM | Updated on Sep 5 2017 12:57 PM

భారత్‌పై దూకుడుగా ఆడాల్సిందే: సంగక్కర

భారత్‌పై దూకుడుగా ఆడాల్సిందే: సంగక్కర

భారత్‌తో గురువారం జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లో శ్రీలంక ఆటతీరు దూకుడుగా ఉండాల్సిందేనని మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర

భారత్‌తో గురువారం జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లో శ్రీలంక ఆటతీరు దూకుడుగా ఉండాల్సిందేనని మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర సూచించాడు. ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన లంక సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే భారత్‌పై కచ్చితంగా నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘ప్రస్తుతం యువకులతో కూడిన శ్రీలంక జట్టును నేను ఇష్టపడుతున్నాను.

పాక్‌పై సునాయాసంగా నెగ్గి ఊపు మీదున్న భారత్‌పై గెలవాలంటే అంత సులువేమీ కాదు. అటు మాథ్యూస్‌ ఆడేది అనుమానంగా ఉండటంతో పాటు తరంగపై నిషేధం ఉండడం జట్టును ఇబ్బంది పెట్టేదే’ అని సంగక్కర అన్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement