మైక్తో కాదు బ్యాట్తో మాట్లాడుతా | Samuels' dig at Warne: I talk with the bat and not on mic | Sakshi
Sakshi News home page

మైక్తో కాదు బ్యాట్తో మాట్లాడుతా

Apr 4 2016 1:10 PM | Updated on Sep 3 2017 9:12 PM

మైక్తో కాదు బ్యాట్తో మాట్లాడుతా

మైక్తో కాదు బ్యాట్తో మాట్లాడుతా

కామెంటరీ బాక్స్లో తన గురించి విమర్శలు చేసిన ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్కు వెస్టిండీస్ బ్యాట్స్మన్ మార్లన్ శామ్యూల్స్ చురకలు అంటించాడు.

కోల్కతా: కామెంటరీ బాక్స్లో తన గురించి విమర్శలు చేసిన ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్కు వెస్టిండీస్ బ్యాట్స్మన్ మార్లన్ శామ్యూల్స్ చురకలు అంటించాడు. తాను బ్యాట్తోనే సమాధానం చెబుతానని, మైక్తో కాదని అన్నాడు. ఆదివారం జరిగిన టి-20 ప్రపంచ కప్ ఫైనల్లో శామ్యూల్స్ 66 బంతుల్లో 85 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

భారత్, వెస్టిండీస్ల మధ్య సెమీస్ మ్యాచ్ సందర్భంగా కామెంటరీ బాక్స్ నుంచి వార్న్.. శామ్యూల్స్పై కామెంట్స్ చేశాడు. 'నా గురించి షేన్ వార్న్ వరుసగా మాట్లాడుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడినపుడు నాతో వార్న్కు ఇబ్బంది కలిగింది. ఏమిటన్నది నాకు తెలియదు. నేనెప్పుడూ అతన్ని గౌరవించలేదు. నా గురించి అతను మాట్లాడే పద్ధతి బాగాలేదు' అని శామ్యూల్స్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement