మిగతా టెస్టులకూ అదే జట్టు | same team for both the Tests | Sakshi
Sakshi News home page

మిగతా టెస్టులకూ అదే జట్టు

Mar 10 2017 12:39 AM | Updated on Sep 5 2017 5:38 AM

మిగతా టెస్టులకూ అదే జట్టు

మిగతా టెస్టులకూ అదే జట్టు

ఆస్ట్రేలియాతో జరగబోయే మిగతా రెండు టెస్టులకు టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు లేవు.

ముంబై: ఆస్ట్రేలియాతో జరగబోయే మిగతా రెండు టెస్టులకు టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు లేవు. అయితే గాయంతో బాధపడుతున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను విడుదల చేయడంతో జట్టు సభ్యుల సంఖ్య 16 నుంచి 15కి తగ్గింది.

మరోవైపు పుణే టెస్టులో ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడి రెండో టెస్టు ఆడలేకపోయిన ఓపెనర్‌ మురళీ విజయ్‌ను జట్టుతో పాటే ఉంచారు. ఈ నెల 16నుంచి  రాంచీలో జరిగే మూడో టెస్టు వరకు అతడు కోలుకోగలడని టీమ్‌ మేనేజిమెంట్‌ భావిస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement