ధోనికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ | Sakshi Shares Picture Of MS Dhonis Newest Toy | Sakshi
Sakshi News home page

ధోనికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

Aug 10 2019 3:37 PM | Updated on Aug 10 2019 7:32 PM

Sakshi Shares Picture Of MS Dhonis Newest Toy

రాంచీ: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ప్రస్తుతం కశ్మీర్‌లో భారత ఆర్మీతో పనిచేస్తున్నాడు. గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోని.. ఆర్మీతో కలిసి విధుల్లో పాల్గొంటున్నాడు. కాగా, ఆగస్టు 15వ తేదీ దాటిన తర్వాత ధోని ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. అయితే  భార్య సాక్షి ఒక గిఫ్ట్‌తో ధోనిని సర్‌ప్రైజ్‌ చేయనున్నారు. ధోనికి ఎంతో ఇష్టమైన ‘ఎ జీప్‌ గ్రాండ్‌ చెరోకీ’ అనే అద్భుతమైన కారును కొన్న సాక్షి ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘ నీ కోసం సరికొత్త టాయ్‌ వెయిట్‌ చేస్తోంది. త్వరలో ఇంటికి రాబోతున్న నీకు వెల్‌కమ్‌. నీకిష్టమైన రెడ్‌బీస్ట్‌ ఇంటికొచ్చింది. నిన్ను నేను చాలా మిస్సవుతున్నా’ అని సాక్షి పేర్కొన్నారు.

ధోనికి కార్లన్నా, బైకులన్నా అమితమైన ఇష్టమనే విషయం తెలిసిందే. ఇప్పటికే అతని షెడ్డులో ఫెరారీ 599 జీటీవో, హమ్మర్‌ హెచ్‌2, జీఎంసీ సీరా వంటి కార్లు  ఉండగా బైకుల్లో.. కవాసాకి నింజా హెచ్‌2,  కాన్ఫిడరేట్‌ హెల్‌కాట్‌, బీఎస్ఎలు ఉన్నాయి. వెస్టిండీస్‌ పర్యటన నుంచి కావాలనే విశ్రాంతి తీసుకున్న ధోని.. పారామిలటరీ రెజిమెంట్‌లో సేవ చేసేందుకు సిద్ధమయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement