రెజ్లర్‌ సాక్షి సీక్రెట్ బయటపడింది | Sakshi after Olympic high, to tie the knot with wrestler Satyawart | Sakshi
Sakshi News home page

రెజ్లర్‌ సాక్షి సీక్రెట్ బయటపడింది

Sep 5 2016 7:55 PM | Updated on Sep 4 2017 12:25 PM

రెజ్లర్‌ సాక్షి సీక్రెట్ బయటపడింది

రెజ్లర్‌ సాక్షి సీక్రెట్ బయటపడింది

రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత రెజ్లర్‌ సాక్షి మాలిక్ దాచిన సీక్రెట్ బయటపడింది.

రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత రెజ్లర్‌ సాక్షి మాలిక్ దాచిన సీక్రెట్ బయటపడింది. ఆమెకు కాబోయే వరుడు ఎవరో తెలిసిపోయింది. సాక్షికి కాబోయే భర్త పేరును ఆమె సోదరుడు సచిన్ వెల్లడించాడు. ఆ లక్కీ ఫెలో ఎవరంటే.. ఆమె సొంతూరు రోహ్టక్కు చెందిన అంతర్జాతీయ రెజ్లర్ సత్యవర్త్ కడియన్. సత్యవర్త్ అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలు కూడా గెలిచాడు.

సత్యవర్త్ (22) వయసు సాక్షి (24) కంటే రెండేళ్లు తక్కువ. రియో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు సాక్షి బ్రెజిల్ వెళ్లకుముందే వీరి పెళ్లి నిశ్చయమైనట్టు సచిన్ చెప్పాడు. ఒలింపిక్స్ తర్వాత సాక్షి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తానో సహచర రెజ్లింగ్ ఆటగాడిని పెళ్లి చేసుకోబోతున్నాని, అయితే తనకు కాబోయే భర్త పేరు మాత్రం సీక్రెట్ అంటూ చెప్పిన సంగతి తెలిసిందే.   

సత్యవర్త్ రెజ్లర్ల కుటుంబం నుంచి వచ్చాడు. అతని తండ్రి సత్యవన్ పేరున్న రెజ్లర్. రోహ్టక్లో ఓ అకాడమీని నడుపుతున్నాడు. సాక్షి, సత్యవర్త్ వివాహం చేసుకుంటారని సత్యవన్ కూడా ధ్రువీకరించాడు. రియో ఒలింపిక్స్లో పతకం గెలిచాక సాక్షి పేరు దేశమంతా మార్మోగిపోయిన సంగతి తెలిసిందే.

ఈ మెగా ఈవెంట్ ముగిశాక ఓ బెంగాలీ దినపత్రికకు  ఇంటర్వ్యూ ఇచ్చిన సాక్షి.. తన పెళ్లి గురించి మనసులో మాటను చెప్పింది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న తన సన్నాహాలకు పెళ్లి ఏమాత్రం అడ్డు కాబోదని చెప్పింది. 'అతను నా సన్నాహాలకు సహాయంగా నిలుస్తాడు. పెళ్లి తర్వాత రెజ్లింగ్‌ క్రీడను కొనసాగించడం ఏమీ సమస్య కాబోదని నేను అనుకుంటున్నా' అని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement