రెండో రౌండ్లో సాకేత్ మైనేని | Saket end of the second round | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్లో సాకేత్ మైనేని

Aug 25 2016 12:24 AM | Updated on Sep 4 2017 10:43 AM

రెండో రౌండ్లో సాకేత్ మైనేని

రెండో రౌండ్లో సాకేత్ మైనేని

యూఎస్ ఓపెన్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సాకేత్ మైనేని రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు.

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సాకేత్ మైనేని రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్‌లో సాకేత్ 6-3, 7-5తో అల్బానో ఒలివిట్టి (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు.

తదుపరి మ్యాచ్‌లో సాకేత్ అమెరికాకు చెందిన మిచెల్ క్రూజర్‌తో తలపడతాడు. మరో భారత ఆటగాడు రామ్‌కుమార్... అలెస్సాండ్రో గియాన్నెసీ (ఇటలీ)తో తలపడనున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement