మలేసియా సూపర్ సిరీస్ నుంచి సైనా, సింధు నిష్క్రమణ | Saina, Sindhu lose in Malaysia | Sakshi
Sakshi News home page

మలేసియా సూపర్ సిరీస్ నుంచి సైనా, సింధు నిష్క్రమణ

Jan 16 2014 7:21 PM | Updated on Sep 2 2017 2:40 AM

మలేసియా సూపర్ సిరీస్ నుంచి సైనా, సింధు నిష్క్రమణ

మలేసియా సూపర్ సిరీస్ నుంచి సైనా, సింధు నిష్క్రమణ

మలేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత దేశ అగ్రశ్రేణి క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి సింధులు ఓటమి పాలైయ్యారు.

కౌలాలంపూర్: మలేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత దేశ అగ్రశ్రేణి క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి సింధులు ఓటమి పాలైయ్యారు. తొలి రౌండ్ ను ఎంతో కష్టం మీద అధిగమించిన ఈ క్రీడాకారిణులు రెండో రౌండ్ ను దాటలేకపోయారు. ఎనిమిదో ర్యాంక్  సైనా నెహ్వాల్ కు ప్రపంచ ఇరవై అయిదవ ర్యాంక్ క్రీడాకారిణి జుయ్ యావో (చైనా)తో జరిగిన మ్యాచ్ లో చుక్కెదురైంది. సైనా నెహ్వాల్ 16-21,21-10, 21-19 తేడాతో యావో చేతిలో కంగుతింది. తొలి సెట్ ను సైనా అలవోకగా గెలుచుకున్నా ఆపై పోరాటం సాగించడంలో విఫలమై ఓటమి పాలైంది.

 

అంతకుముందు జరిగిన మ్యాచ్ లో ఆరో సీడ్ క్రీడాకారిణి జు బే (కొరియన్)చేతిలో 21-16,21-19 పాయింట్ల తేడాతో పి.వి.సింధు ఓటమి పాలైంది. ఎనిమిదో సీడ్ సైనా బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో 21-10, 21-16తో ఇండోనేసియాకు చెందిన హిరా దేసిని ఓడించిన సైనా రెండో రౌండ్ కు చేరిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement