
'సూపర్' సైనా
ప్రపంచ నంబర్ వన్ హోదాకు తగ్గట్టుగానే అద్భుత ప్రదర్శనతో హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ విజేతగా నిలిచింది.
ప్రపంచ నంబర్ వన్ హోదాకు తగ్గట్టుగానే అద్భుత ప్రదర్శనతో హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మూడో సీడ్ థాయ్లాండ్కు చెందిన ఇలనాన్ రచానోను 21-18, 21-14 తేడాతో మట్టికరిపించింది. మాజీ కేంద్ర మంత్రి చిదంబరం విజేతలకు మెడల్స్ అందజేశారు.
అంతర్జాతీయ స్థాయిలో అరుదైన టైటిల్స్‌తో పాటు... అమోఘమైన ఆటతీరుతో చైనా డ్రాగన్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న సైనా నెహ్వాల్.. నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్న మరుసటిరోజే భారత్ లో జరిగే ఏకైక సూపర్ సిరీస్ లో విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయం. గతంలో ప్రకాశ్ పదుకుణె ఒక్కరే ప్రపంచ నంబర్ వన్ ఘనత సాధించారు. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత సైనా మళ్లీ భారత్‌కు నంబర్‌వన్ హోదాను సాధించిపెట్టింది.