సైనా, సింధులకు క్లిష్టమైన ‘డ్రా’ | Saina nehwal , P.V sindhu complex 'draw' | Sakshi
Sakshi News home page

సైనా, సింధులకు క్లిష్టమైన ‘డ్రా’

Feb 19 2014 12:03 AM | Updated on Sep 2 2017 3:50 AM

ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది.

 ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ
 న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. మార్చి 4 నుంచి 9 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హమ్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. దీనికి సంబంధించిన ‘డ్రా’ వివరాలను మంగళవారం విడుదల చేశారు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి.సింధు ఒకే పార్శ్వంలో ఉన్నారు.
 
 అన్ని అడ్డంకులను అధిగమిస్తే వీరిద్దరూ సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడతారు. అంతకుముందు తొలి రౌండ్‌లో కిర్‌స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)తో సైనా... సున్ యూ (చైనా)తో సింధు ఆడతారు. తొలి అడ్డంకిని అధిగమిస్తే సైనాకు రెండో రౌండ్‌లో తొమ్మిదో ర్యాంకర్ జూలియన్ షెంక్ (జర్మనీ)... ప్రపంచ రెండో ర్యాంకర్ యిహాన్ వాంగ్ (చైనా)తో సింధు ఆడే అవకాశముంది.
 
 రెండో రౌండ్‌లోనూ నెగ్గితే క్వార్టర్ ఫైనల్లో సైనాకు నాలుగో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా); సింధుకు ఆరో సీడ్ యోన్ జూ బే (దక్షిణ కొరియా) ఎదురుకావొచ్చు. మరో పార్శ్వం నుంచి టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా), ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్) సెమీఫైనల్‌కు చేరుకోవచ్చు.
 
 పురుషుల సింగిల్స్ విభాగం తొలి రౌండ్‌లో కెంటో మొమాటా (జపాన్)తో కిడాంబి శ్రీకాం త్; ఐదో సీడ్ కెనిచి టాగో (జపాన్)తో పారుపల్లి కశ్యప్ ఆడతారు. మహిళల డబుల్స్ క్వాలి ఫయింగ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడికి తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement