అధికారికంగా సైనాకి అగ్రస్థానం | Saina in quarters, Prannoy, Kashyap lose in Malaysia Open | Sakshi
Sakshi News home page

అధికారికంగా సైనాకి అగ్రస్థానం

Apr 3 2015 3:17 AM | Updated on Sep 2 2017 11:45 PM

అధికారికంగా సైనాకి అగ్రస్థానం

అధికారికంగా సైనాకి అగ్రస్థానం

సైనా నెహ్వాల్... ఇక అధికారికంగా ప్రపంచ నంబర్‌వన్. వారం క్రితమే సైనాకు అగ్రస్థానం ఖరారైనా బీడబ్ల్యుఎఫ్

 సైనా నెహ్వాల్... ఇక అధికారికంగా ప్రపంచ నంబర్‌వన్. వారం క్రితమే సైనాకు అగ్రస్థానం ఖరారైనా బీడబ్ల్యుఎఫ్ అధికారికంగా ర్యాంక్‌లను గురువారం ప్రకటించింది.  తాజా ర్యాంకింగ్స్‌లో 78, 541 పాయింట్లతో ఆమె అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల ముగిసిన ఇండియన్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరుకోవడంతో సైనా ఈ ఘనతను అందుకుంది.
 
  కరోలినా మారిన్ (స్పెయిన్-73, 618) రెండు, లీ జురుయ్ (చైనా-71, 414) మూడో ర్యాంక్‌లో నిలిచారు. హైదరాబాద్ అమ్మాయి పి.వి.సింధు (55, 635) తొమ్మిదో ర్యాంక్‌లో ఉంది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ నాలుగో ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. హెచ్.ఎస్. ప్రణయ్ 14, పారుపల్లి కశ్యప్ 17వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement