13 బంతులాడి ఖాతా తెరవకుండానే..!

Saifuddin removes Gayle early - Sakshi

టాంటాన్‌: వెస్టిండీస్‌ స్టార్‌ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ మరోసారి నిరాశ పరిచాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గేల్‌ డకౌట్‌గా నిష్క్రమించాడు. బంగ్లాదేశ్‌ బౌలర్లను ఎదుర్కోవడానికి ఆరంభం నుంచి తడబడిన గేల్‌ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ బాటపట్టాడు. తన సహజ సిద్ధమైన భారీ షాట్లను వదిలిపెట్టి కుదురుగా ఆడటానికి యత్నించిన గేల్‌ తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. 13 బంతులాడి ‘సున్నా’కే ఔటయ్యాడు.(ఇక్కడ చదవండి: ‘సెకండ్‌ విక్టరీ’ ఎవరిదో?)

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బంగ్లాదేశ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ను గేల్‌, ఎవిన్‌ లూయిస్‌లు ఆరంభించారు. ఈ క్రమంలోనే మొర్తాజా వేసిన తొలి ఓవర్‌ మెయిడిన్‌ అయ్యింది. స్టైకింగ్‌ ఎండ్‌లో గేల్‌ ఉన్నప్పటికీ మొదటి ఓవర్‌లో విండీస్‌ పరుగుల ఖాతా తెరలేదు. ఆపై రెండో ఓవర్‌లో గేల్‌ ఐదు బంతులాడినప్పటికీ కనీసం పరుగు కూడా చేయలేదు. దాంతో విండీస్‌ రెండు ఓవర్లు ముగిసే సరికి రెండు పరుగులు మాత్రమే చేసింది. ఇక సైఫుద్దీన్‌ వేసిన నాల్గో ఓవర్‌ రెండో బంతికి కీపర్‌ రహీమ్‌కు క్యాచ్‌ ఇచ్చి గేల్‌ ఔటయ్యాడు. ఫలితంగా విండీస్‌ ఆరు పరుగుల వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది.


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top